రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత

  • పులివెందులలో మూడు రోజులు పాటు పర్యటించనున్న జగన్
  • రేపు సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైసీపీ అధినేత
  • నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి జూన్ 25 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో సమీక్షలు జరపడంతో పాటు ప్రజలను నేరుగా కలవనున్నారు.


రేపు సాయంత్రానికి జగన్ పులివెందులకు చేరుకుంటారు. అక్కడ ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అక్కడికక్కడే ‘ప్రజాదర్బార్’ కూడా నిర్వహించనున్నారు.


పర్యటనలో భాగంగా రెండో రోజైన జూన్ 24 ఉదయం వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని జగన్ సందర్శించనున్నారు. ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు. గుడి దర్శనం ముగించుకుని మధ్యాహ్నానికి మళ్లీ పులివెందుల క్యాంప్ ఆఫీస్‌కు రానున్న జగన్.. ఆ రోజు మొత్తం ప్రజలు, పార్టీ శ్రేణులతో ముఖాముఖి మాట్లాడుతారు. ఉమ్మడి కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల అర్జీలను స్వీకరిస్తారు. అనంతరం మూడు రోజుల పర్యటన ముగించుకుని జూన్ 25వ తేదీ గురువారం ఉదయం పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.


YS Jagan Mohan Reddy
Pulivendula
YSRCP
Andhra Pradesh Politics
Praja Darbar
Kadapa District

More Telugu News